- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తుఫాన్ పరిహారాన్ని మెక్కిన దొంగలు : అప్పలరాజు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్ : ప్రతిపక్ష పార్టీ నాయకులపై ఏపీ మంత్రి అప్పలరాజు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తిథ్లీ తుఫాన్ పరిహారాన్ని అనర్హుల ఖాతాల్లో జమచేసి.. మెక్కేసిన దొంగలు టీడీపీ నేతలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మత్స్యకార భరోసా పథకంపై అర్ధంపర్థం లేని ఆరోపణలు ఎందుకు చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతల దగుల్బాజీ మాటలు వినే పరిస్థితిలో తాము లేమని చెప్పుకొచ్చారు. ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న మూడు రాజధానుల విషయంలో సవాల్‌లు ఎందుకని మంత్రి ప్రశ్నించారు. అమరావతిని […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ప్రతిపక్ష పార్టీ నాయకులపై ఏపీ మంత్రి అప్పలరాజు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తిథ్లీ తుఫాన్ పరిహారాన్ని అనర్హుల ఖాతాల్లో జమచేసి.. మెక్కేసిన దొంగలు టీడీపీ నేతలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మత్స్యకార భరోసా పథకంపై అర్ధంపర్థం లేని ఆరోపణలు ఎందుకు చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతల దగుల్బాజీ మాటలు వినే పరిస్థితిలో తాము లేమని చెప్పుకొచ్చారు.
ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న మూడు రాజధానుల విషయంలో సవాల్‌లు ఎందుకని మంత్రి ప్రశ్నించారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలనుకుంటున్న అచ్చెన్నాయుడిని ముందు రాజీనామా చేసి నిరసన తెలపాలని స్పష్టం చేశారు. ఆయన రాజీనామా చేస్తే వైసీపీ పోటీకి దిగుతుందన్నారు. తెలంగాణ కోసం టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మరీ రాష్ట్రాన్ని సాధించుకున్నారని మంత్రి అప్పలరాజు ఈ సందర్భంగా గుర్తు చేశారు.
Next Story






