ఇష్టమొచ్చినట్టు నిర్ణయం తీసుకుంటే కుదరదు

66

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌పై జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రమేశ్ కుమార్ తన ఇష్టమొచ్చినట్టు నిర్ణయం తీసుకుంటే సరిపోదని హెచ్చరించారు. చంద్రబాబు చెప్పినట్టు తానా అంటే తందానా అంటే కుదరదని సూచించారు. ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడానికి చంద్రబాబు నానా ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు.