ఆయన లెగ్ మహత్యం….

10

దిశ, వెబ్ డెస్క్: చంద్రబాబు హయాంలో కరువు, దరిద్రం తాండవించాయనీ మంత్రి అనిల్ వ్యాఖ్యానించారు. ఏపీకి టూరిస్టుల్లాగా చంద్రబాబు , లోకేశ్ వస్తున్నారని ఆయన విమర్శించారు. చంద్రబాబు లెగ్ మహత్యంతోనే హైదరాబాద్ అల్లకల్లోలం అయిందని ఆయన తెలిపారు. అక్రమంగా కరకట్టపై నిర్మించిన ఇంట్లో చంద్రబాబు ఉన్నారని తెలిపారు. వరదలు వస్తే చంద్రబాబు ఇల్లు అదే మునిగి పోతుందనీ…దాన్ని ఎవరూ ముంచరని ఆయన తెలిపారు. కరోనా నిబంధనలతో తుంగభద్ర పుష్కరాలను నిర్వహిస్తామని తెలిపారు.