’చిరంజీవి, మోహన్‌బాబులపై పవన్ వ్యాఖ్యలు దురదృష్టకరం‘

by Vemula.Srinu Prasad |   (  Updated:2021-09-26 09:52:55  IST  )

<p>దిశ, ఏపీ బ్యూరో: రిపబ్లిక్ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో ఏపీ ప్రభుత్వంపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. వైసీపీ మంత్రులు పవన్ కల్యాణ్‌పై మాటలయుద్ధానికి దిగుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మంత్రులపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని మంత్రి అవంతి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. పవన్ వ్యాఖ్యలు చూస్తుంటే ఆయన మానసిక పరిస్థితిపై అనుమానం కలుగుతోందన్నారు. సినిమా గురించి మాట్లాడాల్సిన చోట రాజకీయాలు మాట్లాడిన పవన్ [&hellip;]</p>

’చిరంజీవి, మోహన్‌బాబులపై పవన్ వ్యాఖ్యలు దురదృష్టకరం‘
X

దిశ, ఏపీ బ్యూరో: రిపబ్లిక్ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో ఏపీ ప్రభుత్వంపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. వైసీపీ మంత్రులు పవన్ కల్యాణ్‌పై మాటలయుద్ధానికి దిగుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మంత్రులపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని మంత్రి అవంతి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. పవన్ వ్యాఖ్యలు చూస్తుంటే ఆయన మానసిక పరిస్థితిపై అనుమానం కలుగుతోందన్నారు. సినిమా గురించి మాట్లాడాల్సిన చోట రాజకీయాలు మాట్లాడిన పవన్ సినిమా వేదికను రాజకీయంగా మార్చారని ధ్వజమెత్తారు. మెగాస్టార్ చిరంజీవి, మోహన్‌బాబులపై పవన్ వ్యాఖ్యలు సరికాదన్నారు. ఓ పార్టీని నడపాలంటే ఓర్పు, సహనం ఉండాలని.. వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేస్తే తాము సహించేది లేదని మంత్రి అవంతి శ్రీనివాస్ హెచ్చరించారు.

Next Story