- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ ఆలోచన కేసీఆర్‌ది: మంత్రి అల్లోల
<p>దిశప్రతినిధి, ఆదిలాబాద్: వాగులపై చెక్ డ్యాంల నిర్మాణాలతో భూగర్భ జలాలు పెరుగుతాయని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శనివారం నిర్మల్ రూరల్ మండలం చిట్యాల గ్రామంలో రైతు వేదిక నిర్మాణ పనులకు శంకుస్ధాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయనికి పెద్దపీట వేస్తున్నారన్నారు. రైతులందరినీ సంఘటితం చేసేందుకు రైతు వేదికల నిర్మాణం చేపట్టాలన్నదే సీఎం కేసీఆర్ ఆలోచన అని, రైతన్నల సమిష్టి నిర్ణయాలకు ఇవి వేదికలుగా పని చేస్తాయని తెలిపారు. హరిత […]</p>

X
దిశప్రతినిధి, ఆదిలాబాద్: వాగులపై చెక్ డ్యాంల నిర్మాణాలతో భూగర్భ జలాలు పెరుగుతాయని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శనివారం నిర్మల్ రూరల్ మండలం చిట్యాల గ్రామంలో రైతు వేదిక నిర్మాణ పనులకు శంకుస్ధాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయనికి పెద్దపీట వేస్తున్నారన్నారు. రైతులందరినీ సంఘటితం చేసేందుకు రైతు వేదికల నిర్మాణం చేపట్టాలన్నదే సీఎం కేసీఆర్ ఆలోచన అని, రైతన్నల సమిష్టి నిర్ణయాలకు ఇవి వేదికలుగా పని చేస్తాయని తెలిపారు. హరిత హారంలో భాగంగా మంత్రి మొక్కలు నాటారు. ప్రతిఒక్కరూ హరిత హారంలో భాగంగా మొక్కలు నాటాలని సూచించారు. అనంతరం సారంగపూర్ మండలం వైకుంఠపూర్ గ్రామంలో స్వర్ణవాగు పైన రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించనున్న చెక్ డ్యాం పనులకు మంత్రి భూమి పూజ చేశారు.
Next Story






