గిరిజనులకు జీవనోపాధే లక్ష్యం

by  |
గిరిజనులకు జీవనోపాధే లక్ష్యం
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: గిరిజనుల(tribles) జీవనోపాధి మార్గాలను పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. శుక్ర‌వారం రాంన‌గ‌‌ర్ లోని గిరిజ‌న ఆశ్ర‌మ ఉన్న‌త పాఠ‌శాల‌లో ఐటీడీఏ(ITDA) ఆధ్వర్యంలో తోటి (గిరిజన తెగ) కుల‌స్తుల‌కు ప్ర‌భుత్వం మంజూరు చేసిన స్వయం ఉపాధి పథకాల ఉపకరణాలను మంత్రి అల్లోల‌ పంపిణీ చేశారు.

18 మంది ల‌బ్ధిదారుల‌కు తోపుడు బండ్లు, కుట్టు మిష‌న్లు, పిండి గిర్నిఉప‌క‌ర‌ణాల‌ను అంద‌జేశారు. అనంతరం నిర్మ‌ల్ రూర‌ల్ మండలం కౌట్ల (కె) గ్రామంలో రూ.30 ల‌క్ష‌ల నిధుల‌తో నిర్మించిన నూత‌న గ్రామ పంచాయ‌తీ భ‌వ‌నాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో జ‌డ్పీ చైర్ ప‌ర్స‌న్ కె.విజ‌య‌ల‌క్ష్మి, మున్సిప‌ల్ చైర్మ‌న్ గండ్ర‌త్ ఈశ్వ‌ర్, క‌లెక్ట‌ర్ ముషార‌ఫ్ ఫారూఖీ అలీ, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి భ‌వేష్ మిశ్రా త‌దిత‌రులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed