అసద్ కీలక వ్యాఖ్యలు.. టీఆర్ఎస్‌కు ధన్యవాదాలు

by Shyam |   (  Updated:2021-02-11 06:13:52  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(జీహెచ్‌ఎంసీ) మేయర్‌ ఎన్నిక ఎట్టకేలకు పూర్తి అయ్యింది. మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పదవులను కైవసం చేసుకుని నగరంపై మరోసారి గులాబీ జెండా ఎగరేసింది. టీఆర్‌ఎస్‌ రాజ్యసభపక్ష నేత కే.కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మి మేయర్‌గా, తార్నాక కార్పొరేటర్ మోతె శ్రీలత శోభన్‌రెడ్డి డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఎమ్ఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డిప్యూటీ మేయర్ పదవి ఆఫర్ చేసిన [&hellip;]</p>

asaduddin owaisi
X

దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(జీహెచ్‌ఎంసీ) మేయర్‌ ఎన్నిక ఎట్టకేలకు పూర్తి అయ్యింది. మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పదవులను కైవసం చేసుకుని నగరంపై మరోసారి గులాబీ జెండా ఎగరేసింది. టీఆర్‌ఎస్‌ రాజ్యసభపక్ష నేత కే.కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మి మేయర్‌గా, తార్నాక కార్పొరేటర్ మోతె శ్రీలత శోభన్‌రెడ్డి డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఎమ్ఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డిప్యూటీ మేయర్ పదవి ఆఫర్ చేసిన టీఆర్ఎస్ పార్టీకి ధన్యవాదాలు తెలిపారు. అంతేగాకుండా మేయర్, డిప్యూటీ మేయర్‌గా ఎన్నికైన విజయలక్ష్మి, శ్రీలతకు శుభాకాంక్షలు తెలిపారు.

Next Story