- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మిలీషియా సభ్యులు లొంగుబాటు
by Vemula.Srinu Prasad |
<p>దిశ,విశాఖపట్నం: విశాఖ జిల్లా చింతపల్లి ఏఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఎదుట ఐదుగురు మిలీషియా సభ్యులు స్వచ్చందంగా శనివారం లొంగిపోయారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…చింతపల్లి డివిజన్ పరిధిలోని కొర్ర పూర్ణ చంద్రరావు,కొర్ర సన్యాయసిరావు, కొర్ర వక్రి భుగ్రి రాజు, మట్టం మచ్చి రాజు, మట్టం భగత్ రావు లొంగిపోయారని తెలిపారు. సరిహద్దులో పనిచేస్తున్న మావోయిస్టులు కొర్ర నాగేశ్వరరావు, జగన్ వెంటనే లొంగిపోతే వారిపై ఎటువంటి కేసులు ఉండవని ఏఎస్పీ తెలిపారు. ఇటీవల తోటగుడ గ్రామం వద్ద జరిగిన ఎన్ […]</p>

X
దిశ,విశాఖపట్నం: విశాఖ జిల్లా చింతపల్లి ఏఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఎదుట ఐదుగురు మిలీషియా సభ్యులు స్వచ్చందంగా శనివారం లొంగిపోయారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…చింతపల్లి డివిజన్ పరిధిలోని కొర్ర పూర్ణ చంద్రరావు,కొర్ర సన్యాయసిరావు, కొర్ర వక్రి భుగ్రి రాజు, మట్టం మచ్చి రాజు, మట్టం భగత్ రావు లొంగిపోయారని తెలిపారు. సరిహద్దులో పనిచేస్తున్న మావోయిస్టులు కొర్ర నాగేశ్వరరావు, జగన్ వెంటనే లొంగిపోతే వారిపై ఎటువంటి కేసులు ఉండవని ఏఎస్పీ తెలిపారు.
ఇటీవల తోటగుడ గ్రామం వద్ద జరిగిన ఎన్ కౌంటర్లో మావోయిస్టు నేత కిషోర్ మరణించాడని మరొకరు గాయాలతో దొరికారని, ఎన్‌కౌంటర్ స్థలం వద్ద ఏకే47తుపాకీ లభించిందన్నారు. అయితే చింతపల్లి, గూడెం కొత్తవీధి మండలాల్లో నెల రోజుల వ్యవధిలో 13 మంది మావోయిస్టు మిలీషియా సభ్యులు లొంగిపోవడం విశేషం.
Next Story






