థర్డ్ జెండర్‌ లిస్ట్‌లో మిలింద్ సోమన్

by  |
థర్డ్ జెండర్‌ లిస్ట్‌లో మిలింద్ సోమన్
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ నటుడు మిలింద్ సోమన్ ఎప్పటికప్పుడు ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్ చేస్తూనే ఉన్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్స్, అమేజింగ్ క్యారెక్టర్స్‌తో బోల్డ్‌ వేలో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ఈ క్రమంలోనే మరో వెబ్ సిరీస్‌తో వచ్చేస్తున్నాడు. ఈ మధ్య గోవాలో నగ్నంగా పరుగెత్తి వార్తల్లో నిలిచిన ఈ 55 ఏళ్ల యాక్టర్.. ఏఎల్‌టీ బాలాజీ నిర్మిస్తున్న బిగ్గెస్ట్ వెబ్ సిరీస్‌ ‘పౌరష్పూర్‌’లో భాగం అయ్యారు. పీరియాడికల్ డ్రామాగా వస్తున్న సిరీస్ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ కాగా, థర్డ్ జెండరన్ బోరిస్‌‌గా అద్భుతంగా కనిపించారు. పెద్ద ముక్కుపుడక, తిలకం, బ్లాక్ నెయిల్ పాలిష్, హెవీ జ్యువెల్లరీతో పాటు చేతిలో కత్తితో కనిపిస్తున్న మిలింద్ సోమన్.. పవర్‌ఫుల్ పాత్ర చేయబోతున్నట్లు అర్ధమవుతోంది.

పౌరష్పూర్ అనే రాజ్యంలో రాజకీయాలు, కుట్రలు, లింగ యుద్ధాలు కాన్సెప్ట్‌తో వస్తున్న సిరీస్‌‌లో తన పాత్ర స్పెషల్ అని తెలిపారు మిలింద్. ఇంతకు ముందు ఇలాంటి పాత్రలు పోషించలేదన్న ఆయన.. పౌరష్పూర్ ప్రపంచంలో థర్డ్ జెండర్‌‌ ఎప్పుడూ శక్తి పోరాటం చేస్తూనే ఉంటాడని తెలిపారు. పదునైన మేధాసంపత్తి, మనోహరమైన వ్యక్తిత్వం కలిగిన బోరిస్ ప్రేమలో అనేక పార్శ్వాలకు సాక్ష్యంగా ఉన్నాడని తెలిపారు. 16 ఇండియన్ లాంగ్వేజెస్‌లో ఇప్పటికే టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసిన టీమ్.. జీ5లో ప్రసారం కానున్న సిరీస్ టీజర్‌ను ఆదివారం రిలీజ్ చేయబోతుంది. కాగా ఇప్పటికే రిలీజైన ప్రీ టీజర్‌లో ప్రతీ ఫ్రేమ్ చరిత్రకు అద్దం పడుతుండగా స్టన్నింగ్ కాస్ట్యూమ్స్, కలర్‌ఫుల్ సెట్స్ అదిరిపోయాయి.


Next Story