లాక్ డౌన్ భయం.. పెరిగిన వలసలు

by  |
లాక్ డౌన్ భయం.. పెరిగిన వలసలు
X

దిశ, వెబ్ డెస్క్ : ఉరుకుల పరుగులతో విశ్రాంతికి చోటులేని ఈ ప్రపంచంలో కరోనా మహమ్మారి అడ్డుకట్ట వేసి నాలుగు గోడల మధ్య బంధిని చేసి.. ఐక్యమత్యమే మహా ‘బలం’ అని నిరూపించినా.. రెక్కాడితే డొక్కాడాని పేదలు.. వలస కార్మికుల పాలిట శాపంగా మారింది. కరోనా వైరస్ దెబ్బకు చాలా దేశాలు లాక్ డౌన్ మంత్రం జపించాయి. దీనిలో భాగంగా కరోనావ్యాప్తిని అడ్డుకోవడానికి కేంద్రప్రభుత్వం లాక్ డౌన్ అమలు చేసింది. అయితే గతంలో లాక్ డౌన్ సమస్య వలన వలసకార్మికులకు ఉపాధి కరువై బతుకు భారమై గుప్పెడు మెతుకులు దొరకని పరిస్థితి దాపరించింది..సొంతూళ్లకు వెళ్లలేని పరిస్థితి.. నిలువ నీడ కరువై కన్నీళ్లతో కాలం వెళ్ళదీసారు.

అయితే ప్రస్తుతం కరోనా విజృంభన మళ్లీ కొనసాగుతుంది. రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతుడడంతో వలస కార్మికులలో భయం మొదలైంది. ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుడటంతో కరోనా మహమ్మారి కట్టడికి కేజ్రీవాల్ ప్రభుత్వం ఈ నెలాఖరు వరకు నగరంలో నైట్‌ కర్ఫ్యూ విధించింది. దీంతో అక్కడి ప్రభుత్వం లాక్ డౌన్ విధిస్తారు అన్న భయంతో వలస కార్మికులు పిల్లా పాపలతో సొంతూళ్లకు పయనం అయ్యారు. గతంలో ఇబ్బందులు పడినట్టూ ఇప్పుడు కూడా పడకూదనే సొంతూళ్లకు వెళ్తున్నట్టు కార్మికులు వాపోతున్నారు. కార్మికులు పెద్ద ఎత్తున నగరాన్ని ఖాళీ చేస్తుండడంతో బస్సులన్నీ ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి.


Next Story

Most Viewed