సిద్దిపేట జిల్లాలో మహిళా వలస కూలీకి తీవ్ర అస్వస్థత

by  |

దిశ, మెదక్: సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి-లింగుపల్లి గ్రామాల శివారులోని ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న మహారాష్ట్రకు చెందిన మహిళ కూలీ అనారోగ్యానికి గురైంది. దీంతో ఆమెను మిరుదొడ్డిలోని ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అనంతరం సిద్దిపేటకు తరలించారు వైద్యులు. మహిళ తీవ్రమైన జ్వరంతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుందని వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న దుబ్బాక సీఐ హరికృష్ణ, ఎస్ఐ శ్రీనివాస్, వైద్య సిబ్బంది ఇటుక బట్టీల వద్దకు వెళ్లి కూలీల వివరాలు సేకరించారు. ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉంటే వైద్యుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలని, పని ప్రదేశంలో భౌతిక దూరం కచ్చితంగా పాటించాలన్నారు.

tag: migrant women workers, suffer, fever, siddipet, ts news


Next Story