కేసీఆర్ తాజా నిర్ణయం వెనుక ఎవరున్నారంటే..

42

దిశ, వెబ్ డెస్క్: సీఎం కేసీఆర్ తీసుకున్న తాజా నిర్ణయం వెనుక ఎవరున్నారో తెలిసిపోయింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టాలనే ఆలోచన సీఎంకు స్వయంగా వచ్చింది కాదని.. ఓ వ్యక్తి చేస్తున్న మంచి పని వల్లే తీసుకున్నారని వెల్లడైంది. ఆయనే మరేవరో కాదు ఎం. రఘురామ్. వృత్తిరీత్యా ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లెక్చరర్. జడ్చర్ల డిగ్రీ కాలేజీలోని విద్యార్థులకు రఘురామ్ తన సొంత ఖర్చులతో మధ్యాహ్న భోజనం పెడుతున్నాడని సీఎం కేసీఆర్ తెలుసుకున్నారు. నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఇంటర్, డిగ్రీ కాలేజీల్లో ఉన్నారని గుర్తించిన సీఎం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..