మైక్రోసాఫ్ట్‌కు కరోనాను అధిగమించే సత్తా ఉంది!

by  |
మైక్రోసాఫ్ట్‌కు కరోనాను అధిగమించే సత్తా ఉంది!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. తన ఇంట్లోని విశేషాలను, ఆఫీస్ వర్క్ అంశాలను పంచుకున్నారు. తన పనులకు ఎలాంటి ఆటంకం లేకుండా, తన కుమార్తెలు సహాయం చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుత సవాళ్లను అధిగమించి మైక్రోసాఫ్ట్ బయటపడుతుందని సత్య నాదెళ్ల చెప్పారు. తమ సంస్థ బలమైన పునాదులను కలిగి వుందని, ఆర్థికంగా పటిష్ఠ స్థితిలో వుందని ధీమా వ్యక్తం చేశారు.

కరోనా మహమ్మారిని నివారించిన తర్వాత మైక్రోసాఫ్ట్ ఉత్పత్తులకు ఎలాంటి డిమాండ్ ఉంటుందనే అంశాన్ని పరిశీలించాల్సి ఉందని ఆయన వివరించారు. ఉత్పత్తుల సరఫరాలో అడ్డంకులను ఎదుర్కొంటున్నామని, ఈ ఏడాది చివర్లోగా వివిధ డివైజ్‌లను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు మైక్రోసాఫ్ట్ హామీని ఇచ్చారు. ఉత్పత్తుల నాణ్యతను, డిమాండ్‌ను మరీ ముఖ్యంగా ప్రజల భద్రత దృష్ట్యా కరోనాను అధిగమించిన తర్వాత తుది నిర్ణయం ఉంటుందని సత్య నాదెళ్ల స్పష్టం చేశారు. అమెరికా ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీని అభినందించారు. ప్రపంచ ఆర్థిక రంగాన్ని కరోనా నుంచి కాపాడేందుకు అన్ని దేశాలు అవసరమైన చర్యలు చేపడుతుండటాన్ని సత్య నాదెళ్ల స్వాగతించారు.

Tags: microsoft, satya nadella, coronavirus, covid-19


Next Story

Most Viewed