ట్రెండింగ్‌లో మేరే అంగ్నేమే 2.0 సాంగ్

by  |
ట్రెండింగ్‌లో మేరే అంగ్నేమే 2.0 సాంగ్
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్, హిందీ బిగ్ బాస్ 13 ఫేం అసిమ్ రియాజ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘మేరే అంగ్నే మే 2.0’ సాంగ్ మారుమోగుతోంది. ఇప్పటికే 5 మిలియన్ వ్యూస్‌తో యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉన్న ఈ పాట…. 1981లో బిగ్ బి అమితాబ్ బచ్చన్ హీరోగా వచ్చిన ‘లావరిష్’ చిత్రంలోది. కాగా ఈ సాంగ్‌ను గుల్షణ్ కుమార్, టీ సిరీస్ సమర్పణలో భూషణ్ కుమార్ రీమేక్ చేయగా … నేహా కక్కర్, రాజా హాసన్ పాడారు. 1435 ADలో ఓ ముసలి రాజుకు రాజకుమారి(జాక్వెలిన్)ని ఇచ్చి వివాహం చేసేందుకు నిర్ణయిస్తారు. ఈ పెళ్లి ఇష్టం లేని రాజకుమారి దిగులుగా కూర్చుంటుంది. ఆ సమయంలోనే 2020ADలో ఉన్న ఓ గర్ల్ ఫ్రెండ్ తన బాయ్ ఫ్రెండ్‌ను టైమ్ మెషిన్ సాయంతో 1435 టైం పీరియడ్‌లోకి పంపుతుంది. అక్కడ రాజకుమారి అతన్ని చూసి… తనతో కలిసి 2020లోకి వచ్చేస్తుంది. ఆ విధంగా ముసలిరాజుతో పెళ్లి నుంచి తప్పించుకుంటుంది. ఈ క్రమంలో వచ్చే అసిమ్ రియాజ్, జాక్వెలిన్ స్టెప్స్, యాక్టింగ్‌కు ఫిదా అయిపోయారు జనాలు. కాగా అసిమ్‌కు ఇది తొలి ఆల్బమ్ కాగా… తన ప్రియురాలు హిమాన్షు ఖురానాతో కలిసి మరో ఆల్బమ్ చేయబోతున్నాడు.



Next Story

Most Viewed