కార్ల ధరలను పెంచిన మెర్సిడెస్ బెంజ్.. వారికి మినహాయింపు

by  |
benz car
X

దిశ, వెబ్‌డెస్క్: తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ ఇండియా భారత్‌లో తన కార్ల ధరలను పెంచనున్నట్టు వెల్లడించింది. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా ఫీచర్లను మెరుగుపరచడం, పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చుల భారాన్ని అధిగమించేందుకు ఎంపిక చేసిన మోడళ్లపై 2 శాతం వరకు ధరల పెంపు నిర్ణయాన్ని తీసుకున్నామని కంపెనీ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. పెంచిన ధరలు 2022, జనవరి 1 నుంచి అమలవుతాయని, అయితే ఇప్పటికే కార్లను బుక్ చేసుకున్న, ఎంపిక చేసిన మోడళ్ల కోసం నాలుగు నెలలకు పైగా వేచి ఉన్న వినియోగదారులకు ఈ ధరల పెరుగుదల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది.

‘మెర్సిడెస్ బెంజ్ కొత్త జనరేషన్ మోడళ్లను మార్కెట్లో విడుదల చేయనుంది. కొత్త టెక్నాలజీని జోడించి ప్రస్తుతం ఉన్న మోడళ్లను అప్‌డేట్ చేసే ప్రయత్నాల్లో ఉన్నాం. పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చుల మధ్య రానున్న రోజుల్లో అందించాలనుకున్న ఫీచర్ల కోసం ధరల పెంపు తప్పనిసరిగా మారింది. ఈ కారణంగానే ఎంపిక చేసిన మోడళ్ల ధరలు పెంచుతున్నామని’ కంపెనీ వివరించింది.


Next Story