థాంక్యూ ట్రంప్ అంటున్న మీమర్లు

by  |
థాంక్యూ ట్రంప్ అంటున్న మీమర్లు
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అగ్రరాజ్యానికి ఏం చేశాడో తెలియదు కానీ, మాకు మాత్రం ఎంతో ఉపయోగపడ్డాడని మీమర్స్ అంటున్నారు. ఈరోజుల్లో సోషల్ మీడియాలో ప్రతి అంశాన్ని మీమ్‌ల సహాయంతో చెప్పడం ఒక ట్రెండ్. కానీ మీమ్ తయారు చేయడానికి ముందు ఒక టెంప్లేట్ కావాలి. అలాంటి లక్షలాది టెంప్లేట్‌లను డొనాల్డ్ ట్రంప్ అందించాడు. ఆయన ముఖంలో పలికే హావభావాలు, చేతులు, కాళ్ల కదలికల నుంచి ఆయన మాటలు, చేష్టలు, చివరకు హెయిర్ ‌స్టైల్ వరకు మీమర్‌లు దేన్నీ వదిలిపెట్టలేదు.

ముఖ్యంగా ఆయన హెయిర్ స్టైల్ మీద వచ్చిన మీమ్‌లకైతే లెక్కేలేదు. ఇక ఏదైనా మీటింగుల్లో, ప్రసంగాల్లో, అలాగే తన భార్య మెలానియా ట్రంప్‌తో ఉన్నపుడు ఆయన ముఖంలో పలికే వివిధ హావభావాలను ఉపయోగించి ఎన్నో మీమ్‌లను మీమర్లు తయారు చేశారు. అమెరికా అధ్యక్షుడిగా ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ట్రంప్‌కు కూడా తన మీద వచ్చిన మీమ్స్ అంటే చాలా ఇష్టం. ఒకానొక తరుణంలో ఆయన భారతదేశానికి సందర్శనకు రావడానికి ముందు బాహుబలి సినిమాలో ప్రభాస్ శరీరానికి, ఆయన తల తగిలించి చేసిన వీడియోను ట్రంప్ స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. ఇలా ఎంతమంది ఎన్ని రకాలుగా మీమ్స్ వేసి, జోకులు వేసి అవమానించినా ట్రంప్ పట్టించుకోలేదు. అతి పెద్ద వయస్సులో అమెరికా అధ్యక్షుడు అయ్యి, అమెరికా పాలనలో తనదైన ముద్ర వేసిన ట్రంప్‌కు సోషల్ మీడియా మీమర్ల తరఫు నుంచి థాంక్యూ!

Next Story

Most Viewed