నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్న మెహ్రీన్ అప్పుడే రంగంలోకి దిగింది…

by  |
నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్న మెహ్రీన్ అప్పుడే రంగంలోకి దిగింది…
X

దిశ, వెబ్‌డెస్క్: నాచురల్ స్టార్ నాని ‘కృష్ణగాడి వీర ప్రేమ గాధ’ సినిమాతో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టింది మెహ్రీన్ పిర్జాదా. ఈ సినిమాలో తన అభినయంతో స్టార్ హీరోల సరసన కూడా చేసేందుకు అవకాశాలు వచ్చాయి. అతి త్వరలోనే అగ్ర తారల జాబితాలో చేరిపోయిన మెహ్రీన్, హర్యానా మాజీ సీఎం మనవడు భవ్య భిష్టోయితో ప్రేమలో ఉన్నానంటు వెల్లడించి అభిమానులకు షాక్ చేసింది. అంతేకాకుండా నిశ్చితార్థం కూడా జరిగిపోయింది.అభిమానులు ఈ షాక్ నుండి తేరుకోకముందే మెహ్రీన్ తన నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించి ఇంకా పెద్ద షాక్ ఇచ్చింది ఈ భామ. ఎంగేజ్ మెంట్ బ్రేకప్ అయిన బాధలో మెహ్రీన్ ఎవ్వరికీ అందుబాటులో ఉండదని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే.. అందరిని ఆశ్చర్యపరిచే విధంగా ఈ రోజు ‘ఎఫ్3’ షూటింగ్ సెట్స్‌లో దిగిన ఫోటోను షేర్ చేసి మళ్లీ రంగంలోకి దిగినట్లు సిగ్నల్ ఇచ్చింది. తన ఫేవరెట్ ‘ఎఫ్3’ ఫ్యామిలీకి తిరిగొచ్చానని ఈ ఫోటోకు క్యాప్షన్ కూడా పెట్టింది.



Next Story

Most Viewed