బంపర్ ఆఫర్ కొట్టేసిన మేఘా ఆకాష్..

7

దిశ, వెబ్‌డెస్క్: క్యూట్ బ్యూటీ మేఘా ఆకాష్.. తన క్యూట్ పర్ఫార్మెన్స్, లవ్లీ స్క్రీన్ ప్రజెన్స్‌తో వరుస అవకాశాలు దక్కించుకుంటోంది. సౌత్‌లో ఇప్పటికే ఐదారు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న భామ.. ఈ మధ్య నిహారిక కొణిదెల తమిళ్‌లో ఎంట్రీ ఇస్తుందనుకున్న మూవీలో సైతం నిహా ప్లేస్‌ను రీప్లేస్ చేసింది. ఇక ప్రస్తుతం ఏకంగా కండల వీరుడు సల్మాన్ ఖాన్ సినిమా ఆఫర్ కొట్టేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

సల్లూ భాయ్ లేటెస్ట్ మూవీ ‘రాధే – యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’. కరోనా కారణంగా వాయిదా పడ్డ సినిమా షూటింగ్ త్వరలోనే షురూ కానుండగా.. పాన్ ఇండియా ఫ్లేవర్ సమపాళ్లలో యాడ్ చేసేందుకు మూవీ యూనిట్ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే సౌత్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేందుకు సౌత్ నుంచి మేఘా ఆకాష్‌కు వెల్‌కమ్ చెప్తోంది. తనతో పాటు భరత్ శ్రీనివాసన్, నర్రా శ్రీనును ఈ ప్రాజెక్ట్ లో భాగస్వామ్యం చేయనున్నారట సల్మాన్.

కాగా, ఈ చిత్రంలో భరత్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనుండగా.. మేఘా ఆకాష్ తనకు సపోర్ట్ చేసే ఫిమేల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనుంది. ప్రభు దేవా డైరెక్షన్‌లో వస్తున్న సినిమాలో సల్మాన్‌కు జోడీగా దిశా పటానీ నటిస్తుండగా.. రణ్‌దీప్ హుడా, జాకీ ష్రాఫ్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.