#BeMaara అంటున్న హీరోయిన్స్

by  |
#BeMaara అంటున్న హీరోయిన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఎవర్‌గ్రీన్ హీరో ఆర్ మాధవన్, శ్రద్ధా శ్రీనాథ్ నటించిన ‘మార’ ఈ మధ్యే అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైంది. మలయాళం సినిమా ‘చార్లీ’ రీమేక్‌గా వచ్చిన ఈ మూవీ పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. ఆర్ట్ ద్వారా ఎన్ని ఆటంకాలనైనా ఎదుర్కోవచ్చనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సినిమా, తనను కూడా చాలా ప్రభావితం చేసిందని తెలిపింది హీరోయిన్ మేఘా ఆకాశ్. కళ అనేది రోజువారి జీవితంలో పేరుకుపోయిన దుమ్మును తొలగిస్తుందని.. సాధారణ ప్రపంచానికి దూరంగా వాస్తవ ప్రపంచంలోకి ప్రవేశించేలా చేసి ఆత్మను ప్రశాంతంగా ఉంచుతుందని చెప్పింది. ‘మార’ సినిమా తనకు నచ్చిన కళ దగ్గరకు చేరుస్తుందని ఎప్పుడూ అనుకోలేదంటూ.. పెయింటింగ్ వేస్తున్న ఫొటోలను షేర్ చేసింది మేఘ. #BeMaara అంటూ సోషల్ మీడియాలో ట్యాగ్ ట్రెండ్ అవుతున్న క్రమంలో ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంది.

ఇక ఐశ్వర్య రాజేష్ కూడా #BeMaara హ్యాష్ ట్యాగ్‌ను జోడిస్తూ పోస్ట్ పెట్టింది. వంట చేయడం తనలో మరో కోణాన్ని ఆవిష్కరిస్తుందని.. తన పెదాల మీదకు చిరునవ్వును తీసుకొస్తుందని తెలిపింది. నాలో ఉన్న ఈ వర్షన్‌లో ఎలాంటి ఫిల్టర్ ఉండదని.. పూర్తిగా భావోద్వేగం, ప్రేమతో నిండి ఉంటుందని తెలిపింది. అమెజాన్ ప్రైమ్‌లో ‘మార’ సినిమా చూస్తున్న క్రమంలో ఈ జ్ఞాపకాలను తిరిగిపొందగలిగాను అంటూ కుకింగ్ పిక్స్ షేర్ చేసింది ఐశ్వర్య.

ఇక బాలీవుడ్ హీరోయిన్ దియా మీర్జా కూడా ‘మార’ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించింది. ఏదో ఒక రోజు హీరో మాధవన్‌తో కలిసి ఉండాలనుకుంటున్నాను అని తెలిపింది. దీనిపై స్పందించిన మ్యాడీ.. మీరు అలా నాతో ఉండే సమయం కోసం వెయిట్ చేస్తున్నాను అంటూ రిప్లై ఇచ్చాడు.


Next Story