అంద‌రం జ్ఞాపకం చేసుకుందాం : చిరు

by  |
అంద‌రం జ్ఞాపకం చేసుకుందాం : చిరు
X

దిశ, వెబ్‌డెస్క్: భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్ధుల్ కలాం జయంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆయన్ను గుర్తుచేసుకున్నారు. దేశానికి ఆయన ఆయన అందించిన మహత్తర సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ‘దేశంలోని గొప్ప శాస్త్రవేత్తలలో ఆయ‌న‌ ఒకరు, దేశంలోని గొప్ప అధ్యక్షులలోను ఆయన ఒక‌రు, మంచి మాన‌వ‌త్వం ఉన్న మ‌నిషి భార‌త రత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. ఆయ‌న‌ జన్మదినోత్సవం సందర్భంగా అంద‌రం జ్ఞాపకం చేసుకుందాం అని తెలిపారు. కలాం ఆలోచనలు ఎన్నో త‌రాల వారికి స్పూర్తిని నింపుతుందన్నారు. అంతేగాకుండా ఆయనతో దిగిన ఓ ఫొటోను ట్విట్టర్‌లో పోస్టు చేశారు.


Next Story