- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మెగా హీరోల మూవీ రిలీజ్ అప్‌డేట్స్
<p>దిశ, వెబ్‌డెస్క్: మెగా హీరోలు తాము నటిస్తున్న మూవీస్ అప్‌డేట్స్ ఇచ్చారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చిత్రాల విడుదల తేదీలు అధికారికంగా ప్రకటించారు. జూలైలో మెగా ప్రిన్స్ సందడి: కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వస్తున్న వరుణ్ తేజ్ ‘గని’ జూలై 30న థియేటర్లలో సందడి చేయబోతున్నట్లు తెలిపారు. సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తున్న సినిమాలో ఉపేంద్ర, సునీల్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్‌కు […]</p>

దిశ, వెబ్‌డెస్క్: మెగా హీరోలు తాము నటిస్తున్న మూవీస్ అప్‌డేట్స్ ఇచ్చారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చిత్రాల విడుదల తేదీలు అధికారికంగా ప్రకటించారు.
జూలైలో మెగా ప్రిన్స్ సందడి:
కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వస్తున్న వరుణ్ తేజ్ ‘గని’ జూలై 30న థియేటర్లలో సందడి చేయబోతున్నట్లు తెలిపారు. సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తున్న సినిమాలో ఉపేంద్ర, సునీల్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సిద్ధు బుద్ద, అల్లు బాబీ నిర్మిస్తున్న చిత్రానికి ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నారు.
https://twitter.com/GeethaArts/status/1354640650092728322?s=20
ఇండిపెండెన్స్ డేకు ‘పుష్ప’తో వచ్చేస్తున్న బన్నీ
ఇక సుకుమార్ – బన్నీ కాంబినేషన్‌లో వస్తున్న ‘పుష్ప’ సినిమా ఇండిపెండెన్స్ డే కానుకగా రిలీజ్ అవుతోంది. ఆగస్టు 13న చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్. ప్రేక్షకులను థియేటర్‌లో కలిసేందుకు ఎగ్జైటింగ్‌గా ఉందని ట్వీట్ చేసిన అల్లు అర్జున్..సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్‌తో తన కాంబినేషన్ ఎప్పటిలాగే మ్యాజిక్ చేస్తుందని నమ్ముతున్నాను అని తెలిపాడు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో బన్నీ రఫ్ లుక్ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో స్మగ్లర్‌గా నటిస్తున్న బన్నీ చేతిలో గొడ్డలి, మాసిపోయిన జుట్టు, ఒంటి నిండా మట్టి, చెమటతో కనిపించాడు. ఇతర కూలీలతో కలిసి ఉన్న ఫొటో చూస్తుంటే.. ఏదో ఘర్షణకు సన్నద్ధం అవుతున్నట్లుగానే ఉంది. ‘అల వైకుంఠపురంలో’ భారీ హిట్ తర్వాత వస్తున్న ‘పుష్ప’తో వస్తున్న బన్నీ.. ఈసారి కూడా బాక్సాఫీస్ షేక్ చేసేట్లుగానే కనిపిస్తున్నారు.
#PUSHPA loading in theatres from 13th August 2021. Excited to meet you all in cinemas this year.Hoping to create the same magic one more time with dearest @aryasukku & @ThisIsDSP .@iamRashmika @MythriOfficial #PushpaOnAug13 pic.twitter.com/tH3E6OpVeo
— Allu Arjun (@alluarjun) January 28, 2021






