ఒకే ఫ్రేమ్ లో మెగా బ్రదర్స్.. పండగ చేసుకుంటున్న పవన్ ఫ్యాన్స్

by  |
ఒకే ఫ్రేమ్ లో మెగా బ్రదర్స్.. పండగ చేసుకుంటున్న పవన్ ఫ్యాన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు అంబరాన్ని అంటుతున్నాయి. ఉదయం నుంచి సోషల్ మీడియాలో చిరుకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు సైతం చిరుకు విషెస్ తెలుపుతున్నారు. ఇక మెగా అభిమానులు చిరు ఇంటిముందు సందడి చేశారు. ఆయనను కలవడానికి వేల సంఖ్యలో చిరు ఇంటికి చేరుకున్నారు. ఇక చిరు చిన్న తమ్ముడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నకు ప్రత్యేకంగా విషెస్ తెలిపారు. ఉదయం ప్రెస్ నోట్ ద్వారా ‘చిరంజీవి నాకు మాత్రమే మార్గదర్శకుడు కాదని.. ఎంతో మందికి స్ఫూర్తి అని పవన్ తెలిపారు.

మెగా స్టార్‌ తనకు తండ్రి లాంటి వారని.. అంటూ విషెస్ తెలిపిన పవన్ సాయంత్రం చిరును ప్రత్యేకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవి ఇంటికి వెళ్లిన పవన్ ఆయనతో కాసేపు ముచ్చటించారు. అనంతరం అక్కలతో రాఖీ కట్టించుకున్నారు. చాలా రోజుల తరువాత మెగా బ్రదర్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేశారు. చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్..ముగ్గురు అన్నదమ్ములు ఒకే ఫ్రేమ్ లో కనిపిసిన్చేసారికి మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇక మెగా హీరోలు రామ్ చరణ్, ఉపాసన, వైష్ణవ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ తో పాటు మెగా డాటర్ నిహారిక కూడా చిరు బర్త్ డే సెలబ్రేషన్స్ లో మెరిశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Next Story

Most Viewed