కశ్మీరి యంగెస్ట్ ఆథర్‌గా ‘అదీబా రియాజ్’

by  |
కశ్మీరి యంగెస్ట్ ఆథర్‌గా ‘అదీబా రియాజ్’
X

దిశ, ఫీచర్స్ : దక్షిణ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌కు చెందిన 11 ఏళ్ల బాలిక అదీబా రియాజ్.. రచయిత్రిగా తొలి పుస్తకాన్ని పూర్తి చేసింది. ఇది ‘జీల్ ఆఫ్ పెన్‌’‌ పేరుతో ప్రచురితం కాగా, యూనియన్ టెరిటరీ నుంచి రైటర్‌గా పుస్తకాన్ని పబ్లిష్ చేసిన అతి పిన్న వయస్కురాలుగా నిలిచింది. ఈ పుస్తకాన్ని తను కేవలం 11 రోజుల్లో పూర్తి చేయడం విశేషం.

ఏడో తరగతి చదువుతున్న అదీబాకు కథలు రాయడమంటే ఎంతో ఇష్టం. 2019లో అనంత్‌నాగ్ జిల్లా అడ్మినిస్ట్రేషన్ నిర్వహించిన రైటింగ్ కాంపిటీషన్‌లో విజేతగా నిలిచిన క్షణమే ఆ చిన్నారి రచయిత్రి కావాలని నిర్ణయించుకుంది. అయితే అదే సమయంలో ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్‌లో కర్ఫ్యూ విధించడం, ఆ తర్వాత లాక్‌డౌన్‌ కొనసాగడంతో అదీబా పుస్తకాన్ని రాసేందుకు ప్లాన్ చేసుకుంది. ఈ మేరకు కేవలం 11 రోజుల వ్యవధిలో 96 పేజీలతో పూర్తి చేసిన పుస్తకాన్ని ‘జీల్ ఆఫ్ పెన్’‌గా మార్కెట్లోకి తీసుకురాగా, అందరి నుంచి ప్రశంసలు అందుకుంటోంది. ప్రస్తుతం ఈ బుక్ రిటైల్ షాపులతో పాటు ఆన్‌లైన్‌లోనూ అందుబాటులో ఉంది.

‘జీవితంలోని వివిధ కోణాలను స్పృశించిన ఈ పుస్తకంలోని కవితలు, లైఫ్ కోట్స్ హైలెట్‌గా నిలుస్తాయి. ప్రతి ఒక్కరు సామెత, కోట్, పద్యంతో సంబంధం కలిగి ఉంటారని నమ్ముతున్నాను. ఇందులో కూడా అలాంటివే ఉంటాయి. ఈ పుస్తకం అద్దం వంటిది, ఎందుకంటే సమాజం చూడనివ్వని మీ అంతరంగాన్ని.. స్పష్టంగా ప్రతిబింబిస్తుంది’.

– అదీబా రియాజ్, రచయిత్రి



Next Story

Most Viewed