విశాల్‌ను టార్గెట్ చేసిన మీరా

by  |
విశాల్‌ను టార్గెట్ చేసిన మీరా
X

హీరోయిన్ మీరా మిథున్ కోలీవుడ్ కాంట్రవర్సీ స్టార్ అయిపోయింది. ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో రచ్చ చేసే భామ..త్రిష, విజయ్, సూర్య‌పై సంచలన ఆరోపణలు చేసింది. మాఫియా నడిపిస్తున్నారని .. అవకాశాలు లేకుండా చేస్తున్నారని సోషల్ మీడియాలో పోస్ట్‌ల మీద పోస్ట్‌లు పెట్టింది. దాంతో సూర్య, విజయ్ ఫ్యాన్స్ ఆమె దిష్టి బొమ్మ దహనం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు మీరా హీరో విశాల్‌ను టార్గెట్ చేసింది. విశాల్ తనను పెండ్లి చేసుకోవాలని అడుగుతున్నాడని..రెండు మూడేండ్లుగా ఇది జరుగుతుందని చెప్పింది. తనంటే మా అమ్మ‌కు కూడా ఇష్టమే అని తెలిపింది. కానీ, అతన్ని పెండ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని చెప్పింది. ఇప్పటికే ఎంగేజ్మెంట్ చేసుకుని కాన్సిల్ చేసుకున్న విశాల్..నిజంగా ఇలా చేసి ఉంటాడా? అనేది టాక్. దీనిపై విశాల్ స్పందిస్తాడా? లేక తన ఫ్యాన్స్ రియాక్ట్ అవుతారా చూడాలి మరి.


Next Story

Most Viewed