హైదరాబాద్‌లో వైద్య పరికరాల సంస్థ మెడ్‌ట్రానిక్ సెంటర్

49

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ వైద్య పరికరాల ఇంజనీరింగ్ సంస్థ మెడ్‌ట్రానిక్ హైదరాబాద్‌లో తన అత్యాధునిక మెడ్‌ట్రానిక్ ఇంజనీరింగ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ (ఎంఈఐసీ)ను ప్రారంభించింది. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కే టీ రామారావు దీన్ని ప్రారంభించారు. వైద్య పరికరాల తయారీలో ప్రసిద్ధి చెందిన ఈ సంస్థ హైదరాబాద్ కేంద్రంలో రూ. 1,200 కోట్ల పెట్టుబడులను పెట్టనుంది. 1,50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రారంభమైన కేంద్రంలో ప్రపంచ స్థాయి వైద్య పరికరాల ఇంజనీరింగ్, టెస్టింగ్, టెస్ట్ ఆటోమోషన్, ఆవిష్కరణలను అందించనుంది. దీని ద్వారా హెల్త్‌కేర్ రంగంలో ఉపాధి అవకాశాలు భారీగా ఉపాధిని అందించే లక్ష్యంతో ఉన్నట్టు కంపెనీ తెలిపింది. అమెరికాకు చెందిన మెడ్‌ట్రానిక్ ప్రపంచవ్యాప్తంగా 140 దేశాల్లో వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తోంది. అమెరికా తర్వాత హైదరాబాద్‌లో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు కంపెనీ పేర్కొంది. ఇప్పటికే ఈ సంస్థ హైదరాబాద్‌లో ఆర్అండ్‌డీ కేంద్రాన్ని నిర్వహిస్తుండగా, తాజాగా ఏర్పాటు చేసిన సెంటర్ ద్వారా 1,000 మందికి పైగా ఉద్యోగాలు లభిస్తాయని, ఆ తర్వాత అదనంగా మరో 4,000 మందికి ఉపాధి లభించనున్నట్టు తెలుస్తోంది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..