నర్సింగ్ విద్యార్థులపై వైద్యశాఖ చిన్నచూపు

164
nursing students

దిశ, తెలంగాణ బ్యూరో: నర్సింగ్ విద్యార్థులకు వ్యాక్సిన్ కరువైంది. వ్యాక్సిన్ కోసం ప్రభుత్వ వ్యాక్సినేషన్ సెంటర్లను సందర్శించాలని డీఎంఈ సలహాలిస్తున్నారు. సూపర్ స్ప్రెడర్స్ కు ప్రత్యేకంగా డ్రైవ్ చేపట్టి వ్యాక్సిన్ అందించిన ప్రభుత్వం హెల్త్ కేర్ వర్కర్లను చిన్న చూపు చూస్తోంది. రాష్ట్రంలో 161 నర్సింగ్ కళాశాలలుండగా వీటిలో దాదాపుగా 32వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.

వైద్య విద్యార్థుల పట్ల వైద్యవిద్యాశాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. నర్సింగ్ విద్యార్థులకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టి వ్యాక్సిన్ వేయాల్సిన ఉన్నతాధికారులు సాధారణ ప్రజలతో పాటు వ్యాక్సిన్ సెంటర్‌లో వ్యాక్సిన్ వేయించుకోవాలని సలహాలిస్తున్నారు. శిక్షణల నిమిత్తం విద్యార్థులు ఆసుపత్రుల్లో పేషెంట్లకు సేవలు అందించాల్సి ఉంటుంది.

అయితే విద్యార్థులు వ్యాక్సిన్ వేయించుకోకుండా ఆసుపత్రుల్లో శిక్షణలు తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. తమకు వ్యాక్సిన్ ఇవ్వాలని డీఎంఈకి వినతి పత్రాలు అందించగా ప్రత్యేకంగా వ్యాక్సిన్ అందించలేమని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 30లక్షల మంది సూపర్ స్ర్పెడర్స్ ను గుర్తించి ప్రత్యేకంగా వ్యాక్సిన్ అందించిన ప్రభుత్వం హెల్త్ కేర్ వర్కర్లను చిన్న చూపు చూస్తుండటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..