పాతబస్తీలో 100 మంది నకిలీ డాక్టర్లు

by  |
పాతబస్తీలో 100 మంది నకిలీ డాక్టర్లు
X

దిశ ప్రతినిధి , హైదరాబాద్: భాగ్యనగరం నకిలీ డాక్టర్ల అడ్డాగా మారింది. ఇటీవల నగరంలో ఇద్దరు నకిలీ డాక్టర్లు పట్టుబడడంతో అధికారులు తీగలాగితే డొంక కదిలింది. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాతబస్తీలో శుక్రవారం దాడులు నిర్వహించి.. పెద్ద సంఖ్యలో డాక్టర్లుగా చలామణి అవుతున్న కేటుగాళ్లను గుర్తించారు. అధికారులు జరిపిన దాడుల్లో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. దీనిపై జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకట్ మాట్లాడుతూ..నగరంలోని పాతబస్తీలో నకిలీ డాక్టర్లు ఉన్నట్లు సమాచారం అందడంతో శుక్రవారం వైద్య ఆరోగ్య శాఖ అధికారులు దాడులు నిర్వహించారని తెలిపారు.

దాడుల సందర్భంగా అనేకమంది ఎలాంటి అర్హత లేకుండా వైద్యం చేస్తున్నట్లు గుర్తించామని చెప్పారు. ప్రస్తుతం అందరి జాబితాను సిద్ధం చేశామని పేర్కొన్నారు. వారి సర్టిఫికెట్లను పరిశీలించి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అర్హత లేకుండా వైద్య వృత్తిలో కొనసాగుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.


Next Story

Most Viewed