మిడ్జిల్ లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం..

by  |

దిశ, జడ్చర్ల : బీజేపీ జిల్లా పార్టీ పిలుపుమేరకు శుక్రవారం మిడ్జిల్ మండలంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎన్.రాజేశ్వర్ పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఎన్. రాజేశ్వర్ మాట్లాడుతూ.. బాబా సాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు ఎంతో కష్టపడి రచించారని గుర్తుచేశారు.

అటువంటి పవిత్రమైన రాజ్యాంగా దినోత్సవాన్ని గత ప్రభుత్వాలు విస్మరించాయని, కానీ మోడీ ప్రభుత్వం రాజ్యాంగ దినోత్సవం తెరపైకి తెచ్చి నవంబర్ 26న సంవిధాన్ దివాస్ గా పాటిస్తుందని అన్నారు. బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పల్లె తిరుపతి, మండలం ఎస్పీ మోర్చ అధ్యక్షుడు విష్ణు భాయ్, హిందూ హివాని రమేష్ గౌడ్, బాలురాజ్, శ్రీను నాయక్, చందు నాయక్, తదితరులు పాల్గొన్నారు.

FOLLOW US ON ► Facebook , Google News , Twitter , Koo , ShareChat , Telegram , Disha TV

Next Story