మీడియేషన్ అవసరం లేదు.. సుప్రీంకోర్టుకు ఏపీ క్లారిటీ

by Vemula.Srinu Prasad |

<p>దిశ, తెలంగాణ బ్యూరో : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదానికి మధ్యవర్తిత్వం అవసరం లేదని, న్యాయపోరాటానికే తాము మొగ్గు చూపుతున్నామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏపీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై స్పష్టత ఇచ్చింది. ఏపీ నుంచి ఈ క్లారిటీ రావడంతో ఇక తెలంగాణ అభిప్రాయాన్ని [&hellip;]</p>

jagan supreme court
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదానికి మధ్యవర్తిత్వం అవసరం లేదని, న్యాయపోరాటానికే తాము మొగ్గు చూపుతున్నామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏపీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై స్పష్టత ఇచ్చింది. ఏపీ నుంచి ఈ క్లారిటీ రావడంతో ఇక తెలంగాణ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరమే లేకుండా పిటిషన్‌పై సమగ్ర విచారణకు మరో బెంచ్‌కు బదిలీ చేస్తున్నట్లు సీజేఐ తెలిపారు.

కృష్ణా జలాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నదని, కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ చెప్పినా, కృష్ణా మేనేజ్‌మెంట్ బోర్డు చెప్పినా పట్టించుకోలేదని ఆరోపిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీన్ని సోమవారం విచారించి చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, అవసరమైతే రాజ్యాంగం పరిధిలో మధ్యవర్తిత్వం వహించడానికి తాను సిద్ధమని, బుధవారంకల్లా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు వాటి అభిప్రాయాలను తెలియజేయాలని అవకాశం కల్పించారు. ఆ ప్రకారం బుధవారం జరిగిన విచారణ సందర్భంగా ఏపీ ప్రభుత్వం నుంచి మధ్యవర్తిత్వం అవసరం లేదని, న్యాయపరంగానే పరిష్కారాన్ని కోరుకుంటున్నామని సీజేకు స్పష్టం చేశారు. ఇకపైన రెండు రాష్ట్రాలకు సంబంధించిన జలాల అంశంపై విచారణ జరగనున్నది.

Next Story