వ్యాధికారక సూక్ష్మ క్రిములను అంతమొందించే LED లైట్..

by  |
వ్యాధికారక సూక్ష్మ క్రిములను అంతమొందించే LED లైట్..
X

దిశ, మియాపూర్ : హైదరాబాద్ ఆధారిత లెడ్‌ చిప్ ఇండస్ ప్రై. లిమిటెడ్ దేశంలో మొదటిసారి నాన్-యూవీ ఎల్‌ఈడీ లైట్ ద్వారా రోగకారక సూక్ష్మ క్రిములను చంపే పరికరాన్ని అభివృద్ధి చేసింది. శుక్రవారం హైటెక్స్ లో ప్రారంభమైన ఫిక్ ఎక్స్‌పో 2021లో రేప్యూర్ లైట్ ఈ కొత్త ప్రోడక్ట్‌ను స్థానిక మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. హైదరాబాద్‌కు చెందిన సెంటర్ ఫర్ సెల్యులార్ మాలిక్యులర్ బయాలజీ సంస్థ ఆగస్టు 2021లో న్యూయార్క్‌లోని మౌంట్ సినాయ్ హాస్పిటల్‌లోని బీఎస్‌ఎల్ ల్యాబ్‌లో పరీక్షించి ధృవీకరించబడింది. ఎల్ఈడీ చిప్ ఇండస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ విజయ్ గుప్తా హైటైక్స్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.

ఇది శాస్త్రీయంగా నిరూపించబడిన నాన్-యువీ క్రిమిసంహారక వ్యవస్థ అన్నారు. సార్స్ కోవి-2 మరియు ఇన్ఫ్లుయెంజా వైరస్‌లతో పాటు ఇతర బ్యాక్టీరియాలను, ఫంగస్‌లను రేప్యూర్ లైట్ 60 నిమిషాల్లో 60-80% శాతం హరిస్తుందన్నారు. అదే విధంగా జనం గుమిగూడే మాల్స్, ఫలహారశాలలు, మెట్రో కోచ్‌లు, కార్యాలయాలు, పాఠశాలలు, తరగతి గదులు, క్లినిక్‌లు మరియు ఆసుపత్రులలో విలువైన కస్టమర్ సెంటర్లను క్రిమిరహితం చేయడమే గాకుండా పూర్తి రక్షణ కల్పిస్తుందన్నారు. ఇది మైక్రో-బయో టెక్నాలజీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ మరియు వినూత్న ఎల్‌ఈడీ ప్యాకింగ్ ప్రక్రియ యొక్క క్రాస్-కాంబినేషన్‌తో సాధ్యమైన సాంకేతికత అన్నారు.

నగరంలోని కుషాయిగూడలో ఎలక్ట్రానిక్ కాంప్లెక్స్‌లో ఈ తయారీ కర్మాగారం ఉందన్నారు. ఇప్పటివరకు ప్రీ-ట్రయల్ రెస్పాన్స్ చాలా బాగుందన్నారు. 5 సంవత్సరాల డిజైన్ లైఫ్‌తో దీని ధర నెలకు కప్పు కాఫీ కంటే తక్కువేనన్నారు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, కుషాయిగూడ ఫ్యాక్టరీ సైట్‌లో గానీ, అలాగే దేశవ్యాప్తంగా ఉన్న డీలర్ల నెట్‌వర్క్ ద్వారా అందుబాటులో ఉందన్నారు. మరిన్ని వివరాల కోసం, 79812 30551ను గానీ, రెప్యూర్ వెబ్ సైట్‌ను సందర్శించి వివరాలు తెలుసుకోవాలన్నారు.


Next Story