న్యాయవ్యవస్థలో భారీగా బదిలీలు

by  |
న్యాయవ్యవస్థలో భారీగా బదిలీలు
X

దిశ, వెబ్‌డెస్క్: భారత న్యాయవ్యవస్థలో కీలక పరిణామం చోటుచేసుకుంది. దేశవ్యాప్తంగా పలు హైకోర్టు సీజేలు, న్యాయమూర్తులు బదిలీ చేస్తూ న్యాయ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఏకకాలంలోనే 13 రాష్ట్రాలకు చెందిన సీజేలు, న్యాయమూర్తులు బదిలీ అయ్యారు. ప్రస్తుతం హిమాచల్‌ప్రదేశ్‌ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఉన్న అరూప్ గోస్వామి ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ట్రాన్స్‌ఫర్ అయ్యారు. ఇదే తరహాలో ఏపీ హైకోర్టు సీజే జస్టిస్ మహేశ్వరి హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఇక ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ జోయ్‌మాల్యా బాగ్చిని నియమించారు. ప్రస్తుతం ఆయన వెస్ట్‌బెంగాల్‌ హైకోర్టుకు న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారు.

ఇక ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న హిమా కోహ్లీకి పదోన్నతి కల్పిస్తూ.. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా నియామకం అయ్యారు. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు సీజేను ఉత్తరాఖండ్‌కు బదిలీ చేశారు. ఒడిశా సీజే మహమ్మద్‌ రఫిక్‌ను మధ్యప్రదేశ్‌కు బదిలీ చేయగా.. ఎంపీ హైకోర్టు న్యాయమూర్తి సంజయ్ ఉత్తరప్రదేశ్‌ హైకోర్టుకు ట్రాన్స్‌ఫర్ అయ్యారు. ఇక మధ్యప్రదేశ్‌ న్యాయమూర్తి సతీష్ చంద్రను కర్ణాటక ఉన్నత న్యాయస్థానానికి బదిలీ చేశారు. జమ్ముకశ్మీర్‌ హైకోర్టు న్యాయమూర్తి రాజేశ్ బిందాల్‌ను కోల్‌కతాకు బదిలీ చేయగా.. తమిళనాడు హైకోర్టు న్యాయమూర్తి వినీత్‌ కొఠారిని గుజరాత్‌కు బదిలీ చేస్తున్నట్టు న్యాయ మంత్రిత్వ శాఖ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.



Next Story