ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో భారీ చోరీ

by  |
ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో భారీ చోరీ
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని హైదర్‌గూడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో భారీ చోరీ జరిగింది. శుక్రవారం సాయంత్రం ఓ ప్రజాప్రతినిధి ఇంట్లో చొరబడి 16 తులాల బంగారం, కేజీ వెండి, రూ.6లక్షల నగదు అపహరించారు. హై సెక్యూరిటీ జోన్‌లో చోరీ జరగడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రంగంలో దిగిన ఏసీపీ వెంకట్ రెడ్డి, సీఐ రమేష్ కుమార్‌ల బృందం.. కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.

Next Story

Most Viewed