సర్పంచ్ ఇంట్లో భారీ చోరీ

5

దిశ, వెబ్‎డెస్క్ :
వికారాబాద్ జిల్లా కేంద్రంలో భారీ చోరీ జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దుండగులు ఇంటి తాళాలు పగులగొట్టి 20 తులాల బంగారం, లక్ష నగదు దోచుకెళ్లారు.

వివరాల్లోకి వెళ్తే.. ధారూరు మండలం మోమిన్‌కలాన్‌ గ్రామ సర్పంచ్‌ శ్రీనివాస్‌రెడ్డి.. వికారాబాద్‌ పట్టణంలోని ఇసాఖాన్‌బాగ్‌ కాలనీలో నివాసం ఉంటున్నాడు. అయితే రెండు రోజుల క్రితం శ్రీనివాస్‌రెడ్డి కుటుంబ సభ్యులతో బంధువుల ఇంటికి వెళ్లాడు. దగ్గరికి వెళ్లాడు. ఈ క్రమంలో ఇంట్లో చోరీ జరిగింది. సోమవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి చొరబడి బీరువా పగులగొట్టి 20 తులాల బంగారం, లక్ష నగదును ఎత్తుకెళ్లారు. మంగళవారం ఇంటికి వచ్చిన శ్రీనివాస్‌రెడ్డి ఇంట్లో దొంగలు పడ్డారని గుర్తించారు. శ్రీనివాస్ రెడ్డి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు.