- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సూర్యాపేటలో ఘోర ప్రమాదం.. పెళ్లింట విషాదం
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్: పెళ్లి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. వివాహానికి బయల్దేరిన పెండ్లి బృందం తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం బొల్లంపల్లిలో జరిగింది. ఇదే గ్రామానికి చెందిన గద్దగూటి శ్రీహరి ఏకైక కూతురు శిరీషాకు.. శాలిగౌరరం మండలం ఊట్కూరుకు చెందిన గుడిసె గణేష్‌తో ఈ రోజు పెండ్లి జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే స్వగ్రామం నుంచి పెళ్లి బృందం ఊట్కూరుకు బొలెరో వాహనంలో బయల్దేరారు. సరిగ్గా జాజిరెడ్డి గూడెం […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: పెళ్లి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. వివాహానికి బయల్దేరిన పెండ్లి బృందం తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం బొల్లంపల్లిలో జరిగింది. ఇదే గ్రామానికి చెందిన గద్దగూటి శ్రీహరి ఏకైక కూతురు శిరీషాకు.. శాలిగౌరరం మండలం ఊట్కూరుకు చెందిన గుడిసె గణేష్‌తో ఈ రోజు పెండ్లి జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే స్వగ్రామం నుంచి పెళ్లి బృందం ఊట్కూరుకు బొలెరో వాహనంలో బయల్దేరారు. సరిగ్గా జాజిరెడ్డి గూడెం వద్దకు రాగానే అదుపుతప్పిన వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మొత్తం 30 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులు స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Next Story






