- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పక్కా సమాచారంతో వైసీపీ ఇసుక దందా బయటపెట్టిన టీడీపీ నేత
<p>దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో ఒక్క రోజుకు సుమారు 2 వేల లారీల ఇసుక అక్రమంగా రాష్ట్రం నుంచి ఇతర ప్రాంతాలకు అనుమతి లేకుండా తరలిస్తున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. విజయవాడలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ…. ఇసుక తవ్వకాల్లో నెలకు రూ. 600 కోట్లకు పైగా అక్రమాలు జరుగుతున్నాయని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం జేపీ కంపెనీ ద్వారా ఎంత ఇసుక తవ్వకాలు జరిపారు.. ఎంత సరఫరా చేశారనే […]</p>

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో ఒక్క రోజుకు సుమారు 2 వేల లారీల ఇసుక అక్రమంగా రాష్ట్రం నుంచి ఇతర ప్రాంతాలకు అనుమతి లేకుండా తరలిస్తున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. విజయవాడలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ…. ఇసుక తవ్వకాల్లో నెలకు రూ. 600 కోట్లకు పైగా అక్రమాలు జరుగుతున్నాయని విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వం జేపీ కంపెనీ ద్వారా ఎంత ఇసుక తవ్వకాలు జరిపారు.. ఎంత సరఫరా చేశారనే విషయంపై సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం పొంది వాటిల్లోని లెక్కలను బయటపెట్టారు. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఇసుక పాలసీతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రభుత్వం ఇసుక టన్ను రూ. 475 ధరగా నిర్ణయించామని చెప్పారని, ఇప్పుడు రూ. 900 పైగా అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. డ్రెడ్జింగ్ ద్వారా వచ్చిన రూ. 570 కోట్ల విలువైన ఇసుకను జేపీ కంపెనీకి ఇవ్వడం దారుణమని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.






