భారీ అగ్ని ప్రమాదం.. రెండు ఇళ్లు దగ్ధం..

by Batti.Sumithra |

<p>దిశ, నాగార్జునసాగర్ : తిరుమలగిరి సాగర్ మండలం నేతపురంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో రెండు ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. వివరాల్లో వెళితే.. నల్లగొండ జిల్లాలోని తిరుమలగిరి సాగర్ మండలం నేతపురం గ్రామంలో విద్యుత్ తీగలు తెగి ఇంటిపై పడ్డాయి. దీంతో మంటలు చెలరేగి మంటలు ఇల్లంతా వ్యాపించి అంటుకోవడంతో మంటలు ఉవ్వెత్తున ఎగసిపడి పక్కన ఉన్న మరో రెండు ఇళ్లకు వ్యాపించాయి. ఇంట్లోని వారు అప్రమత్తమై బయటకు రావడంతో పెను ప్రమాదం తప్పింది. [&hellip;]</p>

భారీ అగ్ని ప్రమాదం.. రెండు ఇళ్లు దగ్ధం..
X

దిశ, నాగార్జునసాగర్ : తిరుమలగిరి సాగర్ మండలం నేతపురంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో రెండు ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. వివరాల్లో వెళితే.. నల్లగొండ జిల్లాలోని తిరుమలగిరి సాగర్ మండలం నేతపురం గ్రామంలో విద్యుత్ తీగలు తెగి ఇంటిపై పడ్డాయి. దీంతో మంటలు చెలరేగి మంటలు ఇల్లంతా వ్యాపించి అంటుకోవడంతో మంటలు ఉవ్వెత్తున ఎగసిపడి పక్కన ఉన్న మరో రెండు ఇళ్లకు వ్యాపించాయి.

ఇంట్లోని వారు అప్రమత్తమై బయటకు రావడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే ఈ ప్రమాదంలో నేతపురం గ్రామానికి చెందిన తన్నీరు లింగమ్మ. పొదిలి ముత్తాలమ్మ ఇండ్లు కాలిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. కాగా ఈ ఘటనలో ఎవరికీ ఏ ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Next Story