- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గజ్వేల్‌లో భారీ అగ్నిప్రమాదం
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్ : గజ్వేల్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పట్టణంలోని ట్రాన్స్ ఫార్మర్ మరమ్మత్తు కేంద్రంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఇది గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకరావడానికి ప్రయత్నించారు. అయితే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల మంటలు అదుపు చేయడానికి ఎక్కువ సమయం పట్టింది. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం జరిగినట్టు అధికారులు భావిస్తున్నారు. ఆదివారం రాత్రి […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : గజ్వేల్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పట్టణంలోని ట్రాన్స్ ఫార్మర్ మరమ్మత్తు కేంద్రంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఇది గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకరావడానికి ప్రయత్నించారు. అయితే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల మంటలు అదుపు చేయడానికి ఎక్కువ సమయం పట్టింది. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం జరిగినట్టు అధికారులు భావిస్తున్నారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు.
Next Story






