- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముంబై ఆషియానా టవర్స్ లో భారీ అగ్ని ప్రమాదం..
<p>దిశ, వెబ్‌డెస్క్: దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. శుక్రవారం ఉదయం ముంబైలోని ఒషివరా ప్రాంతంలోని ఆషియానా టవర్స్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది 8 అగ్నిమాపక వాహనాలు, 8 జంబో వాటర్ ట్యాంకర్లు, బీఏ వ్యాన్, ఏరియల్ ల్యాడర్ ప్లాట్ ఫాం తో సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశారు. అంబులెన్స్‌ను సైతం అందుబాటులో ఉంచిన అధికారులు ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. శుక్రవారం ఉదయం ముంబైలోని ఒషివరా ప్రాంతంలోని ఆషియానా టవర్స్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది 8 అగ్నిమాపక వాహనాలు, 8 జంబో వాటర్ ట్యాంకర్లు, బీఏ వ్యాన్, ఏరియల్ ల్యాడర్ ప్లాట్ ఫాం తో సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశారు. అంబులెన్స్‌ను సైతం అందుబాటులో ఉంచిన అధికారులు ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. మొదటి ఫ్లోర్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల ప్రాంతంలో పెద్దఎత్తున దట్టమైన పొగ కమ్ముకుంది. అయితే, ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉన్నాయి. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Next Story






