కౌన్సిలర్ ఇంట్లో భారీ చోరీ

by  |
కౌన్సిలర్ ఇంట్లో భారీ చోరీ
X

దిశ, కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో మున్సిపల్ కౌన్సిలర్ వనిత రామ్మోహన్ ఇంట్లో భారీ చోరీ చోటు చేసుకుంది. జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్న వనితా రామ్మోహన్ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో ఉన్న 52 తులాల బంగారం, 60 తులాలకు పైగా వెండి, 15 పట్టుచీరలు, 2 లక్షల నగదు ఇతరత్రా సామగ్రిని చోరీ చేశారు. ఈ ఘటనతో పోలీసు శాఖ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయానికి కూతవేటు దూరంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది.

బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 24న కౌన్సిలర్ భర్త రామ్మోహన్ సోదరుడైన శ్రీనివాస్ కూతురు స్నేహ వివాహం జరిగింది. ఆ మరుసటి రోజే రామ్మోహన్ తండ్రి లక్ష్మీరాజం మృతి చెందారు. దాంతో కౌన్సిలర్ కుటుంబ సభ్యులు ఇంటి అడపడుచుకు ఇవ్వాల్సిన నగలు, వెండి, చీరలు, ఇతరత్రా సామగ్రి ఇంట్లోనే ఉంచి ఇంటికి తాళం వేసుకుని స్వగ్రామమైన మాచారెడ్డికి బయలుదేరారు. మంగళవారం ఉదయం వచ్చి చూసేసరికి ఇంటి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. ఇంట్లో వెతకగా బంగారం, వెండి, నగదు, సామగ్రి చోరీకి గురయ్యాయి. పోలీసులకు సమాచారం అందించగా క్లూస్ టీంతో చేరుకుని విచారణ చేపడుతున్నారు. ఘటన స్థలాన్ని ఇంచార్జి డిఎస్పీ శశాంక్ రెడ్డి పరిశీలించారు.


Next Story

Most Viewed