కరోనా పోరులో విస్తృత టెస్టులు కీలకం : రాహుల్ గాంధీ

by  |
కరోనా పోరులో విస్తృత టెస్టులు కీలకం : రాహుల్ గాంధీ
X

న్యూఢిల్లీ : వచ్చే నెల 3 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ ప్రధాని ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రభుత్వ చర్యలపై విరుచుకుపడ్డారు. కరోనాతో పోరాటంలో విస్తృతంగా టెస్టులు చేయడమే కీలక ఆయుధమని ట్వీట్ చేశారు. మనదేశంలో టెస్టులు అతి స్వల్పంగా జరుగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం టెస్టింగ్ కిట్‌ల కొనుగోలులో జాప్యం వహించిందని వివరించారు. ప్రస్తుతం వీటి కొరతతో బాధపడుతున్నదని పేర్కొన్నారు. దేశంలో పది లక్షల పౌరులకు 149 చొప్పున పరీక్షలు నిర్వహిస్తున్నదని తెలిపారు. అంటే లావోస్(157), నైగర్(182), హోండురాస్(162)ల సరసన ఉన్నట్టు ట్వీట్ చేశారు. ప్రపంచదేశాలతో పోలిస్తే.. భారత్ కరోనాతో పోరులో ఎంతో ముందంజలో ఉన్నదని ప్రధాని తన ప్రసంగంలో పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యను పరోక్షంగా ఉటంకిస్తూ.. మనదేశం లావోస్, హోండురాస్ లాంటి వెనుకబడిన దేశాల చెంతన ఉన్నదని ప్రభుత్వ జాప్యాన్ని విమర్శించారు.

Tags: rahul gandhi, game, pm modi, coronavirus, testing kits, tests


Next Story

Most Viewed