- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్లీజ్ యూజ్ మాస్క్.. బాధ్యతను గుర్తుచేసిన గాంధీజీ
<p>దిశ, పాలేరు: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య భయంకరంగా పెరుగుతోంది. ప్రభుత్వం తమవంతు ప్రయత్నం చేస్తూ.. నియంత్రణ చర్యలు తీసుకుంటున్నా.. జనాల్లో సరైన అవగాహన, భయంలేక నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం బచ్చోడు గ్రామం హుస్నాబాద్ వెళ్లే దారిలో ఏర్పాటు చేసిన జాతిపిత మహాత్మ గాంధీ విగ్రహం అందరికీ బాధ్యతను గుర్తుచేస్తోంది. మూతికి మాస్కు ధరించి ఉన్న మహాత్ముడి విగ్రహం.. […]</p>

దిశ, పాలేరు: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య భయంకరంగా పెరుగుతోంది. ప్రభుత్వం తమవంతు ప్రయత్నం చేస్తూ.. నియంత్రణ చర్యలు తీసుకుంటున్నా.. జనాల్లో సరైన అవగాహన, భయంలేక నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం బచ్చోడు గ్రామం హుస్నాబాద్ వెళ్లే దారిలో ఏర్పాటు చేసిన జాతిపిత మహాత్మ గాంధీ విగ్రహం అందరికీ బాధ్యతను గుర్తుచేస్తోంది. మూతికి మాస్కు ధరించి ఉన్న మహాత్ముడి విగ్రహం.. అందరూ మాస్కు ధరించి జాగ్రత్తగా ఉండండి అంటూ హెచ్చరిస్తోంది. ఈ విగ్రహాన్ని చూసిన ‘దిశ’ రిపోర్టర్ వెంటనే తన ఫోన్‌లో బంధించి, సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీంతో మాస్కు ధరించిన మహాత్ముడి ఫోటో ఇంటర్‌నెట్‌లో తెగ వైరల్ అవుతోంది. ఈ చిత్రాన్ని చూసిన ప్రతిఒక్కరూ వెంటనే మాస్కు ధరిస్తున్నారు. గాంధీజీ ముఖానికి మాస్కు పెట్టిన వ్యక్తిని అభినందిస్తున్నారు.






