ఎకో ఓనర్లకు.. మారుతి సుజుకీ షాక్‌

by Harish |

<p>దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా మల్టీ పర్పస్‌ వాహనమైన ఎకో ఓనర్లకు గట్టి షాక్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న ఎకో వాహనాల్లో 40,453 యూనిట్లను రీకాల్‌ చేస్తున్నట్టు గురువారం ప్రకటించింది. నవంబర్‌ 4,2019 నుంచి ఫిబ్రవరి 25,2020 వరకు తయారైన ఈ వాహనాల్లో హెడ్‌ల్యాంప్‌ ఫిక్స్‌నకు సంబంధించి సమస్యలు తలెత్తడంతో వెనక్కి పిలిపిస్తున్నట్టు తాజా ప్రకటనలలో వెల్లడించింది. ప్రస్తుతం దేశీయంగా వినియోగిస్తున్న ఈ వాహన [&hellip;]</p>

ఎకో ఓనర్లకు.. మారుతి సుజుకీ షాక్‌
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా మల్టీ పర్పస్‌ వాహనమైన ఎకో ఓనర్లకు గట్టి షాక్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న ఎకో వాహనాల్లో 40,453 యూనిట్లను రీకాల్‌ చేస్తున్నట్టు గురువారం ప్రకటించింది. నవంబర్‌ 4,2019 నుంచి ఫిబ్రవరి 25,2020 వరకు తయారైన ఈ వాహనాల్లో హెడ్‌ల్యాంప్‌ ఫిక్స్‌నకు సంబంధించి సమస్యలు తలెత్తడంతో వెనక్కి పిలిపిస్తున్నట్టు తాజా ప్రకటనలలో వెల్లడించింది. ప్రస్తుతం దేశీయంగా వినియోగిస్తున్న ఈ వాహన యజమానులు మారుతి డీలర్ల వద్ద ఉచితంగా మరమ్మత్తులు చేయించుకోవచ్చని సూచించింది.

Next Story