మహిళపై కన్నేసి.. మున్సిపల్ అధికారికి చెప్పుదెబ్బలు

276
stop-harrasment

దిశ, వెబ్‌డెస్క్ : తరచూ ఫోన్ చేసి వేధిస్తున్నాడనే కారణంతో ఓ మహిళ ప్రభుత్వ అధికారికి చెప్పుదెబ్బలతో దేహశుద్ది చేసింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో శనివారం సాయంత్రం వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. సంగీత అనే మహిళ కొత్త ఇళ్లు కట్టుకునేందుకు స్థానిక మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంది.

ఆ సమయంలో వివాహిత నెంబర్ తీసుకున్న శానిటరీ ఇన్ స్పెక్టర్ వెంకన్న ఆమెకు తరచు ఫోన్స్, మెసెజెస్ చేస్తూ వేధింపులకు గురిచేశాడు. బుద్ది మార్చుకోవాలని పలుమార్లు హెచ్చరించినా వినకపోవడంతో ఈ విషయాన్ని సంగీత తన భర్తకు తెలిపింది. అనంతరం భర్త, కుటుంబసభ్యుల సాయంతో నేరుగా మున్సిపల్ ఆఫీసుకు వెళ్లి సదరు అధికారిని బయటకు లాక్కొచ్చి అందరూ చూస్తుండగానే కుటుంబ సభ్యులు దేహశుద్ధి చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు వైరల్‌గా మారాయి.