- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అత్తింటి వేధింపులు.. చిరంజీవి భార్య ఆత్మహత్య
by Batti.Sumithra |
<p>దిశ, భూపాలపల్లి: జిల్లా కేంద్రంలోని రెడ్డి కాలనీలో అత్తింటి వేధింపులు భరించలేక కోడలు ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెరుకు తోట లహరి(35)కి కొన్నేండ్ల క్రితం భూపాలపల్లికి చెందిన చిరంజీవితో వివాహం జరిగింది. మద్యానికి బానిసైన భర్త నిత్యం లహరితో గొడవ పడేవాడు. నానా వేధింపులకు గురి చేసేవాడు. ఇతడికి తోడు అత్తమామలు, భర్త ఇద్దరు సోదరులు కూడా లహరిని హింసించేవారని.. ఈ నేపథ్యంలోనే ఎలుకల మందు […]</p>

X
దిశ, భూపాలపల్లి: జిల్లా కేంద్రంలోని రెడ్డి కాలనీలో అత్తింటి వేధింపులు భరించలేక కోడలు ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెరుకు తోట లహరి(35)కి కొన్నేండ్ల క్రితం భూపాలపల్లికి చెందిన చిరంజీవితో వివాహం జరిగింది. మద్యానికి బానిసైన భర్త నిత్యం లహరితో గొడవ పడేవాడు. నానా వేధింపులకు గురి చేసేవాడు. ఇతడికి తోడు అత్తమామలు, భర్త ఇద్దరు సోదరులు కూడా లహరిని హింసించేవారని.. ఈ నేపథ్యంలోనే ఎలుకల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్టు మృతురాలి సోదరుడు ఫిర్యాదు చేశాడని పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్టు భూపాలపల్లి సీఐ వాసుదేవన్ వివరణ ఇచ్చారు.
Next Story






