వివాహిత ఆత్మహత్య..

43

దిశ, వెబ్ డెస్క్: చందానగర్‌లో విషాదం చోటు చేసుకుంది. భవనంపై నుంచి దూకి వివాహిత ఆత్మహత్య చేసుకుంది. 6 నెలల క్రితం వరంగల్‌కు చెందిన శబరీష్‌తో శ్రీ విద్యకు వివాహం అయింది. బెంగుళూరుకు తన భర్త వెళ్లడంతో ఇటీవల కుటుంబ సభ్యుల ఇంటికి ఆమె వెళ్లింది. కాగా భర్తతో ఫోన్లో మాట్లాడుతూ ఆమె వాగ్వాదానికి దిగింది. వెంటనే బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. తీవ్రగాయాల పాలైన ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఆమె మరణించారు. కాగా భర్త వేధింపుల వల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృత దేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతు రాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.