- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంటినుండి బయటకు వెళ్లిన మహిళ.. విగతజీవిగా కనిపించడంతో…
<p>దిశ, కామారెడ్డి : దోమకొండ మండల కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. నాలుగు రోజుల క్రితం ఇంట్లోనుంచి వెళ్లిన మహిళ గ్రామ శివారులోని దొంగలమర్రి వద్ద శవమై కనిపించింది. అయితే ఆమెపై అత్యాచారం చేసి హత్య చేసారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. దోమకొండ మండల కేంద్రానికి చెందిన పటాన్ షమీమ్(40) భర్త చనిపోయాడు. దోమకొండలో బట్టలు కుడుతూ, బీడీలు చుడుతూ జీవనం కొనసాగిస్తోంది. అయితే నాలుగు రోజుల క్రితం షమీమ్ ఇంటినుంచి వెళ్ళిపోయింది. […]</p>

దిశ, కామారెడ్డి : దోమకొండ మండల కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. నాలుగు రోజుల క్రితం ఇంట్లోనుంచి వెళ్లిన మహిళ గ్రామ శివారులోని దొంగలమర్రి వద్ద శవమై కనిపించింది. అయితే ఆమెపై అత్యాచారం చేసి హత్య చేసారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. దోమకొండ మండల కేంద్రానికి చెందిన పటాన్ షమీమ్(40) భర్త చనిపోయాడు. దోమకొండలో బట్టలు కుడుతూ, బీడీలు చుడుతూ జీవనం కొనసాగిస్తోంది.
అయితే నాలుగు రోజుల క్రితం షమీమ్ ఇంటినుంచి వెళ్ళిపోయింది. గురువారం మధ్యాహ్నం గ్రామ శివారులోని దొంగల మర్రి వద్ద గుర్తు తెలియని మహిళ మృతదేహం ఉందనే సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. మృతి చెందిన మహిళ నాలుగు రోజుల క్రితం ఇంటినుంచి వెళ్లిన షమీమ్ గా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అయితే గుర్తు తెలియని వ్యక్తులు షమీమ్ పై అత్యాచారం చేసి హత్య చేసినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నామని, విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని బిక్కనూర్ సీఐ అభిలాశ్ తెలిపారు.






