సీఎం కేసీఆర్, మంత్రి మల్లారెడ్డి చిత్ర పటాలకు కొబ్బరి నీళ్లతో అభిషేకం..!

by  |

దిశ, మేడ్చల్ : కబ్జా దారుల నుంచి మార్కెట్‌ను కాపాడినందుకు చిరు వ్యాపారులు సీఎం కేసీఆర్, కార్మిక మంత్రి మల్లారెడ్డి చిత్ర పటాలకు కొబ్బరి నీళ్లతో అభిషేకం చేశారు.మంత్రి మల్లారెడ్డి, మార్కెట్ చైర్మెన్ సునీత లక్ష్మీ కృషి వల్లనే తమకు మార్కెట్ దక్కిందని పేర్కొంటూ చిరువ్యాపారులు ధన్యవాదాలు తెలిపారు. మార్కెట్‌ను కాజేసేందుకు కొందరు మార్కెట్ బయట కుట్రలకు పాల్పడుతున్నారని కార్మికుల ఆవేదన వ్యక్తంచేశారు. మంత్రి మల్లారెడ్డి ఆశీర్వాదంతో తాము మార్కెట్ యార్డును తిరిగి దక్కించుకున్నామని చిరువ్యాపారులు ఆనందం వ్యక్తంచేశారు.

ఈ సందర్భంగా మార్కెట్ కార్మికులు మాట్లాడుతూ.. మంత్రి మల్లారెడ్డి, మార్కెట్ చైర్మెన్ సునీత లక్ష్మీ కృషి వల్లనే మాకు మార్కెట్ దక్కిందని, జవహర్ నగర్‌లో ఎవరూ చేయలేని పనిని చేసి మాకు అండగా నిలిచారన్నారు. కేసీఆర్ కూరగాయల మార్కెట్‌లోని చిరు వ్యాపారస్తుల బతుకులపై కుట్రలకు తెరలేపిన కొందరు అ సాంఘిక శక్తులు చైర్మన్ సునీత లక్ష్మీపై లేనిపోని బండాలు వేస్తూ రాద్దాంతం చేస్తున్నారని ఈ సందర్బంగా గుర్తుచేశారు.

FOLLOW US ON ► Facebook , Google News , Twitter , Koo , ShareChat , Telegram , Disha TV

Next Story