సఫారీలు ఊపిరిపీల్చుకోండి.. 360 వస్తున్నాడు?

by  |
సఫారీలు ఊపిరిపీల్చుకోండి.. 360 వస్తున్నాడు?
X

దిశ, స్పోర్ట్స్ : కెరీర్‌లో ఉన్నత స్థితిలో ఉన్న సమయంలోనే సౌత్ ఆఫ్రికా క్రికెటర్ ఏబీ డి విలియర్స్ ఆటకు గుడ్‌బై చెప్పాడు. 2018లో డి విలియర్స్ తీసుకున్న ఈ నిర్ణయంతో క్రికెట్ అభిమానులు షాక్‌కి గురయ్యారు. ఐపీఎల్‌లో సత్తా చాటుతున్న డి విలియర్స్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి రావాలని పట్టుబడుతున్నారు. క్రికెట్ సౌతాఫ్రికా కూడా డి విలియర్స్ వస్తే తప్పకుండా జట్టులో చోటుంటుందని భరోసా ఇచ్చింది.

ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ మార్క్ బౌచర్ అతడి పునరాగమనంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. ఏబీ డివిలియర్స్ త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి పునరాగమనం చేస్తాడని చెప్పాడు. వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ ఆడే అవకాశం ఉన్నట్లు తెలిపాడు. ఇంగ్లాండ్ జట్టుతో త్వరలో టీ20, వన్డే సిరీస్‌లు ఉన్నాయి. దీనికి సంబంధించి నిర్వహించిన జూమ్ సమావేశంలో బౌచర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. టీ20 వరల్డ్ కప్ కంటే ముందే డి విలియర్స్ తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.

Next Story

Most Viewed