తగ్గేదెలే అంటున్న మావోయిస్టులు.. ఒకరి హత్య.. ఇద్దరి కిడ్నాప్!

99

దిశ, భద్రాచలం : దిశ, భద్రాచలం : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం.. గోర్గుండ – తోనార్ నడుమ నిర్మాణంలో ఉన్న రహదారి వద్ద పనులను పరిశీలిస్తున్న సూపర్ వైజర్‌పై దాడి చేశారు. ఆయుధాలు, విల్లంబులతో అటాక్ చేసి మట్టుబెట్టారు. అంతేకాకుండా రెండు వాహనాలకు నిప్పంటించారు. ఈ దాడిలో ఒక టిప్పర్, ట్రాక్టర్ దగ్ధమయ్యాయి. వాహనాలు తగులబెడుతుండగా అడ్డుపడిన సిబ్బందిని సైతం మావోయిస్టులు చితకబాదారు.

చివర్లో ఇద్దరు వ్యక్తులను కిడ్నాప్ చేసినట్లు సమాచారం. ఈ ఘటన పోలంపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చేటుచేసుకోగా, పోలీసులు ఇంకా ధృవీకరించలేదు. ఇదిలాఉండగా బీజాపూర్ ఘటన తర్వాత మావోయిస్టులు ప్రభుత్వంలో చర్చలకు సిద్ధం అంటునే వరుస హత్యలు, కిడ్నాప్‌లకు పాల్పడుతున్న విషయం తెలిసిందే.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..