- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నడి రోడ్డుపై మాజీ నక్సలైట్ శవం.. ఇది వారి పనేనా ?
by Sridhar Babu |
<p>దిశ, భద్రాచలం : ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మాజీ నక్సలైట్‌ని హతమార్చారు. బీజాపూర్ జిల్లా గంగలూరు గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకుంది. వింజమ్ రాజు అనే యువకుడు సుమారు 9 ఏళ్ళపాటు మావోయిస్టులతో కలిసి పనిచేశాడు. అతను లొంగిపోయి గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ సాధారణ జీవితం గడుపుతున్నాడు. రాజు నిత్యావసర సరుకుల కోసం బీజాపూర్ ప్రక్కన ఉన్న పదేరా వారపుసంతకు వెళ్ళగా, సాధారణ దుస్తుల్లో ఉన్న మావోయిస్టులు రాజుని కిడ్నాప్ చేసి తమవెంట తీసుకెళ్ళినట్లు సమాచారం. ఈ విషయమై […]</p>

X
దిశ, భద్రాచలం : ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మాజీ నక్సలైట్‌ని హతమార్చారు. బీజాపూర్ జిల్లా గంగలూరు గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకుంది. వింజమ్ రాజు అనే యువకుడు సుమారు 9 ఏళ్ళపాటు మావోయిస్టులతో కలిసి పనిచేశాడు. అతను లొంగిపోయి గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ సాధారణ జీవితం గడుపుతున్నాడు. రాజు నిత్యావసర సరుకుల కోసం బీజాపూర్ ప్రక్కన ఉన్న పదేరా వారపుసంతకు వెళ్ళగా, సాధారణ దుస్తుల్లో ఉన్న మావోయిస్టులు రాజుని కిడ్నాప్ చేసి తమవెంట తీసుకెళ్ళినట్లు సమాచారం. ఈ విషయమై కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉండగా, 19వ తేది రాత్రి మావోయిస్టులు రాజుని హత్య చేసి మృతదేహం రహదారిపై పడేశారు. ఈ హత్యని బీజాపూర్ ఎస్‌పీ కమలోచన్ కశ్యప్ ధృవీకరించారు. హత్యకుగల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం తెలిసిన వెంటనే భద్రతా బలగాలు ఆ ప్రాంతానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు.
Next Story






